AP: ప్రభుత్వ పాలనలో మహిళలకు గౌరవం కల్పించే దిశగా ‘నారీ శక్తి వందన్ అధినియం’ ఒక చారిత్రక ముందడుగని 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్ లంకా దినకర్ అన్నారు. మహిళల సాధికారత కోసం అనేక సంస్కరణలు, సంక్షేమ పథకాలు, ప్రోత్సాహక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించడం ద్వారా వారి రాజకీయ ప్రాతినిధ్యం పెరుగుతుందన్నారు.