MBNR: జిల్లా కేంద్రంలోనీ పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ల బీపీ మండల్ వర్ధంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి బీపీ మండల్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీసీల హక్కుల ఆశయ సాధన కోసం వారు ఎంతో కృషి చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్, తదితరులు పాల్గొన్నారు.