NZB: రోడ్డు ప్రమాదాల నివారణకు 10 మంది అనుభవజ్ఞులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు సీఐ బిక్షపతి తెలిపారు. సోమవారం ధర్పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రయాణాల్లో ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉంటూ ఇతరుల భద్రతను కూడా గమనించాలన్నారు. గ్రామసభల్లో రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కల్పిస్తామని చెప్పారు.