AP: చంద్రగిరిలో పొలిటికల్ హీట్ పెరిగింది. 2029లో చంద్రగిరిలో టీడీపీని ఓడించి తీరుతామని వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అన్నారు. జగన్ కుటుంబంతో తమకు మూడు తరాలుగా సంబంధాలు ఉన్నాయని తెలిపారు. కష్టకాలంలో జగన్ తమకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు. తమ మధ్య బంధం ఏంటో జగన్కు, తమకు తెలుసని అన్నారు. భూమనతో తమకు విభేదాలు అంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.