ప్రకాశం: ఒంగోలు భాగ్యనగర్‌లో ప్రకాశం జిల్లా TDP కార్యాలయం కోసం కేటాయించిన స్థలాన్ని ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహా రెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక అధికారులతో మాట్లాడారు. ఈ సందర్శనలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొఠారి నాగేశ్వరరావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.