VKB: అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా పరిగి ఫైర్ ఆఫీసర్ సేవ్యా నాయక్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి (CHC)లో అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ప్రమాదాలు జరిగినప్పుడు మంటలను ఆర్పే విధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి ప్రాక్టికల్‌గా వివరించారు. ఆసుపత్రి వంటి రద్దీ ప్రదేశాల్లో అప్రమత్తత అవసరమని అధికారులు సూచించారు.