HYD: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తలపెట్టిన నూతన పార్టీకి మారోజు వీరన్న అనుచరులు, CPUSI, దళితబహుజన సంస్థలు మద్దతు ప్రకటించాయి. సామాజిక న్యాయమే లక్ష్యంగా ఈనెల 25న పార్టీని ప్రారంభిస్తున్నట్లు ఆమె తెలిపారు. జయశంకర్ ఆశయాలమేరకు సామాజిక తెలంగాణ సాధనకై పోరాడుతానని, మాజీ మావోయిస్టులు, ఉద్యమకారులకు న్యాయం చేస్తూ సర్వోదయ తెలంగాణ దిశగా అడుగులు వేస్తానన్నారు.