MBNR: నవాబ్‌పేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జనాభా గణన-2027 శిక్షణ కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. మూడు విడతల్లో జరిగే ఈ శిక్షణలో 89 మంది ఎన్యూమరేటర్లు, 15 మంది సూపర్వైజర్లు పాల్గొంటున్నారు. గృహ గణనలో పాటించాల్సిన నిబంధనలపై ఛార్జ్ ఆఫీసర్ సువర్ణ, ఎంఈవో నాగ్య నాయక్ దిశానిర్దేశం చేశారు. ఫీల్డ్ ట్రైనర్లు ప్రకాశ్, జగదీశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.