MBNR: జడ్చర్లలోని ఎర్రసత్యం కాలానికి చెందిన నారాయణకు పక్షవాతం సంభవించి కాలు పడిపోయింది. విషయం తెలుసుకున్న మాజీమంత్రి లక్ష్మారెడ్డి ఆయన నివాసానికి చేరుకొని పరామర్శించారు. ఈ సందర్భంగా నారాయణకు సంభవించిన పక్షవాత రోగానికి వైద్య ఖర్చులు తాను పూర్తిగా భరిస్తానని భరోసానిచ్చి బాధితునికి బాసటగా నిలిచారు. బాధిత కుటుంబ సభ్యులు మాజీ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.