AP: రాష్ట్రంలో చాలా జిల్లాల్లో ఎండలు మండిపోతుంటే నెల్లూరు, గూడూరు, మార్కాపురం జిల్లా దోర్నాల మండలంలో భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులకు అనేక చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. యడవల్లి దగ్గర రహదారిపై చెట్టు విరిగిపడింది. దీంతో కర్నూలు – గుంటూరు రహదారిపై వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు చెట్లను తొలగించి, ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.