ASF: జూన్ 1న ముఖ్యమంత్రి జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ హరిత అధికారులను ఆదేశించారు. కాగజ్ నగర్ బహిరంగ సభకు మహిళా సంఘాల సభ్యులను బస్సుల్లో తరలించాలన్నారు. ప్రతి బస్సుకు ఇద్దరు ఇన్ఛార్జ్లను నియమించి, ఎండల దృష్ట్యా తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు.