జిల్లాలో ధాన్యం కొనుగోలు, అన్లోడింగ్ ప్రక్రియను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఎక్కడా జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. శనివారం లోకేశ్వరం మండలంలోని సాత్ గావ్, నగర్ గ్రామాల్లో ఉన్న రైస్ మిల్లులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను సమీక్షించారు.