ADB: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో వీవోఏలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని CPI జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. శనివారం జిల్లా కలెక్టరేట్ ఎదుట చేపట్టిన సమ్మెకు పార్టీ నాయకులు సంఘీభావం ప్రకటించారు. కనీస వేతన చెల్లింపు, ఉద్యోగ భద్రత, పలు అంశాలను నెరవేర్చాలని కోరుతూ గత 12 రోజులుగా సమ్మె చేపట్టిన ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని పేర్కొన్నారు.