KMR: లింగంపేట మండలం నల్ల మడుగుతాండ సమీపంలో శనివారం వడ్ల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. మండలంలోని జల్దిపల్లి గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి వడ్ల బస్తాలను లోడ్ చేసుకుని గాంధారి సమీపంలోని రైస్ మిల్లుకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు గ్రామ రైతులు తెలిపారు.