TG: హైదరాబాద్ నాంపల్లి పీఎస్‌లో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విచారణ ముగిసింది. సుమారు 7 గంటల పాటు పోలీసుల ఆయనను విచారించారు. సింగరేణిపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో బాల్క సుమన్‌ను పోలీసులు విచారించి.. స్టేట్మెంట్ రికార్డు చేశారు. అనంతరం వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. కాసేపట్లో మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చనున్నారు.