MBNR: తెలంగాణ ఎడ్సెట్-2026 ఫలితాల్లో పాలమూరు జిల్లాకు చెందిన నీరటి ఉదయ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలో 3వ ర్యాంకు, మహమ్మద్ ఒమర్ ముజాహిద్ 9వ ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా పాలమూరు విశ్వవిద్యాలయం విద్యా కళాశాల ప్రిన్సిపల్ డా. అదేర్ల కరుణాకర్ రెడ్డి అభినందనలు తెలిపారు. విద్యార్థులు నాణ్యమైన ఉపాధ్యాయులుగా ఎదిగి సమాజాభివృద్ధికి తోడ్పడాలని ఆకాంక్షించారు.