MBNR: జడ్చర్ల మున్సిపాలిటీలో గౌడ ఫంక్షన్ హాల్ సమీపంలో చేపట్టిన డ్రైనేజీ నిర్మాణ పనులను అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ పరిశీలించారు. పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. వర్షాకాలంలో మురుగు సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.