BHNG: అడ్డగూడూరు మండలం కోటమర్తి గ్రామానికి చెందిన చిప్పలపల్లి యశోద భర్త నాగయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. శనివారం ఆమెతో 2005-2006లో అడ్డగూడూరు జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న తోటి స్నేహితులు పరామర్శించారు. అనంతరం రూ.50 వేల ఆర్థిక సాయం అందించి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.