PDPL: జన గణన-2027లో భాగంగా నిర్వహిస్తున్న హౌస్ లిస్టింగ్ సర్వేకు ప్రజలు పూర్తిగా సహకరించాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో హౌస్ లిస్టింగ్ సర్వేలో పాల్గొని ఎన్యుమరేటర్లకు అవసరమైన వివరాలు అందజేశారు. సర్వే ప్రక్రియను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సర్వేలో ఇచ్చే సమాచారంతో సంక్షేమ పథకాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపారు.