KMR: హైదరాబాద్లో నిర్వహించిన ‘పవర్ ఉమెన్ 2026′ జాతీయ అవార్డుల్లో క్రీడల విభాగంలో పిట్లంకు చెందిన ప్రతిభ తక్కడపల్లి అవార్డు అందుకుంది. మార్షల్ ఆర్ట్స్ అత్యధిక అంతర్జాతీయ పతకాలు సాధించడంతో పాటు, 6 వేల మంది బాలికలకు ఉచితంగా స్వీయ రక్షణ శిక్షణ ఇచ్చి మహిళా సాధికారతకు కృషి చేసినందుకు ఆమెను సత్కరించారు.