HYD: వాతావరణ మార్పుల నుంచి రైతులకు రక్షణ కల్పించేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ‘తెలంగాణ వాతావరణ సలహా కార్యక్రమం’ సచివాలయంలో ప్రారంభించారు. DIL ఇండియా, ఎవిడెన్స్ యాక్షన్ సంస్థల భాగస్వామ్యంతో ఏఐ ఆధారంగా మండలాల వారీగా ఖచ్చితమైన వాతావరణ సమాచారం, వ్యవసాయ సూచనలను 17 జిల్లాల్లోని 15 లక్షల మంది రైతులకు వాట్సాప్ ద్వారా నేరుగా చేరవేయనున్నారని పేర్కొన్నారు.