MDK: ఏడుపాయల వనదుర్గ భవాని ఆలయంలో పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి అనంతరం పల్లకి సేవ చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తుల రద్దీతో కళకళలాడింది. భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.