AP: మన్యం జిల్లా సాలూరు మెంటాడ వీధిలో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో మంత్రి సంధ్యారాణి పాల్గొన్నారు. కాలువల్లో మురికిని తొలగించారు. వీధులను శుభ్రం చేశారు. ఇంధన పొదుపులో భాగంగా కాన్వాయ్ పక్కనపెట్టి, బైక్పై మెంటాడ వీధికి వెళ్లారు. రైతులకు రాయితీ విత్తనాలను పంపిణీ చేశారు. ప్రకృతి వ్యవసాయ కార్యాచరణ పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు.