AP: జూన్ 1న కాకినాడ జిల్లా తునిలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. చామవరంలో ‘ఎన్టీఆర్ భరోసా’ పథకం కింద పింఛన్లను ఆయన పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వ పథకాల అమలు, వారికి కలుగుతున్న లబ్ధి గురించి స్థానిక ప్రజలను అడిగి తెలుసుకోనున్నారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చంద్రబాబు పర్యటన సాగనుంది. MP సానా సతీశ్‌బాబు సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు.