భారత్, వెస్టిండీస్ మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 17 వరకు జరగనుంది. శుభ్మన్ గిల్ ఈ పర్యటనలో వన్డే జట్టుకు నాయకత్వం వహించే అవకాశం ఉంది. సెప్టెంబర్ 27 తొలి వన్డే, 30న రెండో వన్డే, అక్టోబర్ 3న చివరి వన్డే జరగనుంది. అలాగే తొలి టీ20 అక్టోబర్ 6, రెండోది 9న, మూడో మ్యాచ్ 14న, చివరి టీ20 అక్టోబర్ 17న ముగియనుంది.