AP: నియోజకవర్గాల పునర్విభజన, మహిళా బిల్లులపై కేంద్ర ప్రభుత్వం పట్టుదలగా ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. బిల్లులను గతంలో వ్యతిరేకించిన వారి ఆలోచనలు ఇప్పుడు మారవచ్చని, రెండు బిల్లులను విడదీసి చూడాల్సిన అవసరం లేదని చెప్పారు. రెండు బిల్లులు కలిపి వస్తేనే మహిళలకు న్యాయం జరుగుతుందన్నారు. ఈ రెండు బిల్లులు దేశ రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకొస్తాయన్నారు.