NRPT: ఉట్కూర్ మండలం పెద్దజట్రం గ్రామ అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు యూనిఫాంలు, పుస్తకాలు పంపిణీ చేశారు. సర్పంచ్ వాకిటి వెంకటేష్ పాల్గొని విద్యార్థులకు అందజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కిరణ్ కుమార్, అంగన్వాడీ సిబ్బంది, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.