GDWL: అయిజ శివారులోని బింగిదొడ్డి పెద్ద చెరువు కట్ట కింద వెలసిన తిమ్మప్ప స్వామికి శనివారం విశేష పూజలు నిర్వహించారు. అర్చకులు కోనేరు జలాలతో అభిషేకం చేసి ఆకుపూజ, హోమం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. రాత్రికి భజన కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పరిసర గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.