ADB: జూన్ 1న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాగజ్ నగర్ మండల కేంద్రంలోని ఎక్స్ రోడ్ వద్ద నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొననున్నారని ఆదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాపూరావు అన్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభ స్థలి వద్ద కొనసాగుతున్న ఏర్పాట్లను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.