AP: ధవళేశ్వరం బ్యారేజీ నుంచి కాల్వలకు నీటిని రేపు విడుదల చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. కాల్వలకు మరమ్మతుల దృష్ట్యా పరిస్థితిని బట్టి దశలవారీగా నీటి విడుదల ఉంటుందని చెప్పారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభంకాబోతున్న ప్రస్తుత తరుణంలో రైతులు ముందస్తు నాట్లు వేసుకోవాలని సూచించారు. ఎల్నినోతో వర్షాభావం వస్తే తగిన నీటి స్టోరేజీపై దృష్టి పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.