BDK: మణుగూరుకు చెందిన ఓ మహిళ సోషల్ మీడియా పరిచయంతో సైబర్ మోసానికి గురై రూ.23 లక్షలు కోల్పోయింది. సినిమా అవకాశాలు కల్పిస్తానంటూ నమ్మించిన వ్యక్తి బ్యాంక్ ఖాతా వివరాలు సేకరించి డబ్బును కాజేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మోసాన్ని గుర్తించిన బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.