SRPT: మూడు డిస్కం ఏర్పాటును బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. ఇవాళ సూర్యాపేటలో వారు మాట్లాడుతూ ఈ విషయంలో రైతుల పక్షాన ముందుండి పోరాడుతామన్నారు. రైతులు కరెంటు ఎంత వాడుతున్నారో తెలియడం లేదని, రైతుల మోటార్లకు మీటర్లు పెట్టడం తప్పదు కాబట్టి మూడు డిస్కం పెడతామనడం విడ్డూరంగా ఉందన్నారు.