AP: రాష్ట్రంలో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫీడ్, సీడ్ ధరలు ఇష్టానుసారంగా పెంచారని, డీజిల్ ధరల పెంపుతో ఆక్వా రైతుల నడ్డివిరిచారని ఆవేదన వ్యక్తం చేసింది. యూనిట్‌కు రూ.1.50 విద్యుత్ సబ్సిడీ అమలు కాలేదని, రైతుల అంగీకారంతోనే ఫీడ్ ధరల పెంపు ఉండాలని తెలిపింది. జూన్ 10లోపు సబ్సిడీపై నిర్ణయం తీసుకోవాలని, లేదంటే ఆందోళన చేస్తామని హెచ్చరించింది.