ఆరోగ్యంగా బరువు తగ్గడానికి ‘6-6-6’ వాకింగ్ రూల్ అద్భుతంగా పనిచేస్తుంది. దీని ప్రకారం ఉదయం 6 లేదా సాయంత్రం 6 గంటలకు 60 నిమిషాలు నడవాలి. నడకకు ముందు 6 నిమిషాల వార్మప్, తర్వాత 6 నిమిషాల కూల్-డౌన్ తప్పనిసరి. ఇది బరువు తగ్గించడమే కాకుండా, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచి ఒత్తిడిని తగ్గిస్తుంది. ఫిట్‌గా ఉండాలనుకునే వారు ఈ సులభమైన చిట్కాను రోజూ పాటించడం ఎంతో మేలు.