MDK: పార్లమెంట్లో మహిళా బిల్లును కాంగ్రెస్ అడ్డుకోవడాన్ని నిరసిస్తూ బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని బస్టాండ్ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించి, రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ నిరసనలో బీజేపీ నేతలు రాగి రాములు, అవినాష్ రెడ్డి, శంకర్ గౌడ్, కన్నయ్య, దయానంద రెడ్డి, చింతల శేఖర్ పాల్గొన్నారు.