KMM: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మిట్టపల్లి నాగేశ్వరరావు (నాగి) సతీమణి మిట్టపల్లి కృష్ణవేణి (52) మృతి చెందారు. శనివారం ఆమె మృతి పై వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ సంతాపం వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులతో కలిసి ఆమె పార్దివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.