VKB: కుల్కచర్ల డ్వాక్రా భవనంలో సయోధ్య స్వచ్ఛంద సంస్థ (కృతి కళా సెంటర్) ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న 60 మంది గిరిజన మహిళలకు శనివారం కుట్టు మిషన్లు, సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఆంజనేయులు మాట్లాడుతూ.. మహిళలు స్వయం శక్తితో ఆర్థికంగా ఎదగాలని, అన్ని రంగాల్లో రాణించాలని కోరారు.