BDK: భద్రాద్రి క్షేత్రంలో సీతారామచంద్రస్వామి వారి నిత్య కళ్యాణ వేడుక శనివారం ఘనంగా జరిగింది. వేకువజామునే ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు, అనంతరం బేడా మండపంలో శాస్త్రోక్తంగా పరిణయ మహోత్సవాన్ని నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల మధ్య కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది. ఈ వేడుకను దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.