ASF: కెరమెరి మండల కేంద్రంలో రోడ్డు భద్రతపై విద్యార్థులతో కలిసి పోలీసులు శనివారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో MLA కోవ లక్ష్మి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ హెల్మెట్ ధరించి వాహనం నడుపుతున్న ప్రయాణికులను ఎమ్మెల్యే పువ్వులు ఇచ్చి అభినందించారు. అందరూ బాధ్యతగా వ్యవహరించి హెల్మెట్ ధరించాలని పిలుపునిచ్చారు.