SKLM: కోటబొమ్మాళి మండలం కొత్తపల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు ఆధ్వర్యంలో శనివారం స్పెషల్ ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో శిక్షణ పొందిన ఉపాధ్యాయులతో పాఠ్యాంశాలు బోధించడం జరుగుతుందని ఆ పాఠశాల హెచ్ఎం శాంతకుమారి పేర్కొన్నారు. కార్పొరేట్ పాఠశాలల కంటే ధీటుగా ప్రభుత్వబడులు నిర్వహిస్తున్నారని ఆమె తెలియజేశారు.