PPM: పాలకొండలో జాతీయ అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా గ్యాస్ సిలిండర్ల భద్రతపై అగ్నిమాపక విభాగం అవగాహన కార్యక్రమం నిర్వహించింది. శనివారం గ్యాస్ గోదాల వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో అగ్నిమాపక అధికారి జామి సర్వేశ్వరరావు మాట్లాడుతూ.. సిలిండర్లను సురక్షితంగా తనిఖీ చేసిన తరువాత మాత్రమే వినియోగదారులకు సరఫరా చేయాలని డెలివరీ సిబ్బందికి సూచించారు.