HYD: ఉప్పల్ రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలోకి ప్రేక్షకులను ఎంట్రీ చేస్తున్నారు. SRH, CSK ఫాన్స్ భారీ సంఖ్యలో తరలిరావడంతో బారికేడ్ల నడుమ ప్రత్యేక క్యూలైన్లలో స్టేడియం లోపలికి అనుమతిస్తున్నట్లుగా మల్కాజ్ గిరి పోలీసులు తెలిపారు. ప్రతి చర్యను పరిశీలిస్తున్నామని ఎవరు తొందరపడొద్దని సూచించారు. నేటి మ్యాచ్లో సైతం క్యూఆర్ టికెటింగ్ కొనసాగుతున్నట్లు వివరించారు.