VZM: రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు బొబ్బిలి డీఎస్పీ ఆర్. గోవిందరావు నేతృత్వంలో సబ్ డివిజన్ పరిధి చిన ఐటీఐ కాలనీలో 60 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలు నిషేధించే లక్ష్యంగా ప్రతి ఇంటిని నిశితంగా పరిశీలించారు. తనిఖీల్లో టౌన్ సీఐ నారాయణరావు, గ్రామీణ సీఐ ఎస్.శ్రీనివాస్ పాల్గొన్నారు.