MBNR: మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని మర్లు ప్రాంతానికి చెందిన గిరిధర్ గౌడ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి శనివారం వారి నివాసానికి చేరుకుని మృతుడి భౌతిక గాయానికి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయనతో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.