ASR: వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆదేశించారు. శనివారం ఆయన అరకు మండలం గన్నెల పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఆయన ఆసుపత్రిలోని రికార్డులను పరిశీలించారు. అనంతరం మందుల నిల్వలు పరిశీలించి ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు.