AP: తప్పుడు పోస్టులపై మాజీ సీఎం సతీమణి భారతిరెడ్డి సీరియస్ అయ్యారు. ప్రసారం చేసిన యూట్యూబ్ చానళ్లకు లీగల్ నోటీసులు జారీ చేశారు. తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా SMలో కథనాలు, పోస్టులు పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. థింక్ ఆంధ్ర, M9తో పాటు గూగుల్, మెటా, ‘X’లకు నోటీసులు జారీ చేశారు. తక్షణమే ఆ కథనాలను, పోస్టులను తొలగించాలని నోటీసుల్లో పేర్కొన్నారు.