ATP: జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవి ఎస్సీ మాదిగ కులానికి కేటాయించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎమ్మెస్ రాజు పేర్కొన్నారు.ఇవాళ ఉరవకొండ R&B లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం భూమిలేని నిరుపేదలను గుర్తించి, 8వ విడత భూ పంపిణీ కార్యక్రమం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు అక్కులప్ప తదితరులు పాల్గొన్నారు.