VSP: మహిళ రిజర్వేషన్ బిల్లు పాస్ అవుతుందని మహిళలు ఆశగా ఎదురుచూశారని విశాఖ జిల్లా బీజేపీ మహిళ అధ్యక్షురాలు నాదెండ్ల జ్యోతి అన్నారు. బీజేపీ నగర పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇండియా కూటమి బిల్లును అడ్డుకోవడంతో మహిళలకు నిరాశ మిగిలిందన్నారు. దేశంలో మహిళల ఆకాంక్షపై ఇండియా కూటమి నీరు చల్లిందని ఆరోపించారు.