HNK: మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఉందని, BJP అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని MLA నాగరాజు విమర్శించారు. ఆదివారం HNK జిల్లా కేంద్రంలోని DCC భవన్లో DCC అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. తెలంగాణను అవమానించిన BJP MPలు ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.