పార్వతీపురం టౌన్ రైల్వే స్టేషన్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ డిసిసి జిల్లా అధ్యక్షులు వంగల దాలినాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్లో సమస్యలు కూత పెడుతున్నాయని ఆరోపించారు. రాత్రిపూట రైల్వే స్టేషన్ పరిసరాలలో విద్యుత్ లైట్లు సక్రమంగా లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు.